కాజల్ అగర్వాల్ .కుర్ర కారు గుండెల్లో అందాల చందమామ. సీనియర్, జూనియర్ అని లేకుండా స్టార్ హీరోలందరితోనూ నటించిన స్టార్ హీరోయిన్. కెరీర్ పీక్స్ లో ఉండగా ప్రేమించిన గౌతమ్ కిచ్లూని వివాహమాడి కుర్రకారుగుండెల్ని రంపపు కోత కోసింది.
పెళ్లి అయిన రెండో ఏడాదే ఒక బిడ్డకు జన్మనిచ్చి మరింత షాక్ ఇచ్చింది. ఇక కొడుకు పుట్టాకా కాజల్ సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇస్తుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కాజల్ రీఎంట్రీ పెద్ద సంచలనంగా మారింది.
బరువు తగ్గి, మునుపటి రూపంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యింది. ఇప్పటికే తమిళ్ లో ఘోస్టీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ నే పట్టేసింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న NBK108 లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్నీ మేకర్స్ కన్ఫర్మ్ చేస్తూ కాజల్ ను తమ చిత్రంలోకి ఆహ్వానించారు.
” నందమూరి బాలకృష్ణ సరసన నటిస్తున్న కాజల్ కు స్వాగతం. నీకు ఈ సినిమా గొప్ప ప్రయాణం కాబోతోంది. వెల్కమ్ కాజల్” అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లి అయ్యి, బిడ్డ పుడితే.. అక్క, వదినా క్యారెక్టర్స్ తో రీ ఎంట్రీ ఇస్తారు. కానీ, మన చందమామ మాత్రం రీ ఎంట్రీ కూడా హీరోయిన్ గానే వస్తుంది. మరి ఈ సినిమాతో కాజల్ మళ్లీ పుంజుకుంటుందా..? హీరోయిన్ గా సెట్ అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.