మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక నిరాశతో ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఈ మంచు హీరో మోసగాళ్లు సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ విష్ణు కి చెల్లెలుగా నటిస్తుంది. ఇక ఈ సినిమా పై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూఈ సినిమా యూనివర్సల్ స్టోరీతో వస్తున్నట్లు తెలిపాడు. అయితే హాలీవుడ్ లో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని, అయిన కూడా మన తెలుగు నేటివిటీకి తగట్టు కథలో లో కొన్ని మార్పులు చేసినట్లు చెప్పాడు. ఇక ఈ సినిమా నాకు సూపర్ హిట్ ను అందిస్తోందని విష్ణు చెప్పుకొచ్చారు. అయితే గత కొంత కాలంగా విష్ణుకు సరైన హిట్ లేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కా్‌మ్ నేపథ్యంలో వస్తున్నట్లు తెలుస్తుంది. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు.