మెగాస్టార చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో మెగా అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను కూడా స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఆచార్య బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ మరింత హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించగా.. సోనూసూద్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే, ట్రైలర్‌లో ఎక్కడ కాజల్ కనిపించలేదు. దీంతో కాజల్ సీన్స్ కట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా కాజల్ ప్రస్థావనే రాలేదు. వేదికపై మాట్లాడిన చిరు కానీ, చెర్రీ కానీ, డైరెక్టర్ కొరటాల, నిర్మాతలు.. ఇలా ఒక్కరి నోటి వెంట కూడా కాజల్ పేరు వినిపించలేదు. దీంతో ‘ఆచార్య’లో నుంచి కాజల్ సీన్లను కట్ చేశారని, అందుకే కాజల్‌ను పక్కన పెట్టేశారంటూ వచ్చిన రూమర్స్ నిజమేననిపిస్తోంది. అంతేకాదు, ‘ఆచార్య’ సినిమాలో విలన్‌గా నటించిన సోనూసూద్ పేరు కూడా ఎవరూ ప్రస్తావించలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి అతిథిగా విచ్చేయగా, చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ మెహర్ రమేష్, చిత్రబృందంతో పాటు పూజాహెగ్డే కూడా హాజరయ్యింది. చిరంజీవి పూజాహెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె నవ్వు బాగుంటుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు.