చేపకళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ ఇటీవల తను ప్రేమించిన గౌతమ్ కిచ్లు ను కాజల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా గౌతమ్, కాజల్ ఇద్దరూ కలిసి నాలుగు రోజుల క్రితం హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు.
ఇక పెళ్లి తర్వాత ఇద్దరూ మొదటిసారి మాల్దీవులకు వెళ్లి అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కాజల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఆమె తన హోటల్ గదికి సంబంధించి గదిలో గౌతమ్ కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.