చేప కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలస్ లో గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో మార్వాడి సాంప్రదాయ పద్ధతిలో కాజల్ ఈ వివాహం చేసుకుంది.అయితే పెళ్లి తర్వాత వారి దాంపత్య జీవితానికి సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది.
మరోవైపు గతం లో ఒప్పుకున్న సినిమా షూటింగ్ లను హాజరయ్యేరేందుకు కూడా సిద్ధమవుతోంది. సెట్స్ పై ఉన్న చిత్రాలే కాక తాజాగా కొత్త చిత్రానికి ఓకే చెప్పింది కాజల్. ఈ చిత్రంలో కాజల్ తో మరో ముగ్గురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. మిగిలిన ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరనే దానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ డీకయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.