తమిళ స్టార్ హీరో విజయ్ గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మాస్టర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు విజయ్ రాబోతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఖైదీ ఫేమ్ లోకేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
మరోవైపు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో తుపాకీ 2 కి ఒకే చెప్పాడు విజయ్. ఇక పోతే ఈ సినిమాలో లో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేశారనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. అయితే ఈ అమ్మడు మొదటి హీరోయిన్ గా కాదట సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేశారట. కరోనా అనంతరం జరగబోయే షెడ్యుల్ లో కాజల్ కూడా షూట్ లో పాల్గొంటుందట.