పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన కాజల్. ఆ వెంటనే గర్భం దాల్చడం, కొడుక్కి జన్మనివ్వడంతో ఆమె కెరీర్ లో గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె సినిమాల్లోకి వచ్చింది.
కాజల్ రీఎంట్రీ ఇచ్చిన మాట నిజమే కానీ, ఆమె టాలీవుడ్ లోకి మాత్రం ఇంకా రాలేదు. తమిళ్ లో ఇండియన్-2 సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఆ వెంటనే అజిత్ మూవీలో నటించడానికి అంగీకరించింది.
అలా కోలీవుడ్ కు పరిచయమైన ఈ చందమామ, ఎట్టకేలకు టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. బాలకృష్ణ సరసన నటించడానికి కాజల్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా సెట్స్ పైకి ఆమె వస్తోంది.
అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది బాలయ్య సినిమా. మార్చి 4 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూలో లో కాజల్ జాయిన్ అవుతుంది. రీఎంట్రీ తర్వాత ఆమెకిదే తొలి సినిమా.
తెలుగులో ఆమె చివరి చిత్రం మోసగాళ్లు. మధ్యలో ఆచార్య సినిమాలో నటించినప్పటికీ ఆమె పోర్షన్ మొత్తాన్ని కట్ చేశారు. ఇప్పుడు బాలయ్య సినిమాతో ఆమె రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కోసం ఆమె కోటి రూపాయల పారితోషికం తీసుకుంటోంది.