సీనియర్ హీరోయిన్ కాజోల్ కరోనా బారిన పడింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తనకు పాజిటివ్ గా నిర్థారణ అయిందని, రీసెంట్ గా తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని కోరింది కాజోల్. అయితే ఈ సందర్భంగా మిగతా వాళ్లతో పోలిస్తే, చాలా విభిన్నంగా స్పందించింది కాజోల్.
తనకు కరోనా సోకిందని తెలిసిన వెంటనే తన కూతురు ఫొటోను పోస్ట్ చేసింది కాజోల్. కూతురు నైసా దేవగన్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను పెట్టింది. కరోనా సోకిన తన ఫొటోను పోస్ట్ చేసే కంటే, ప్రపంచంలోనే ఎంతో అందమైన తన కూతురు చిరునవ్వు చూడడం తనకు ఎంతో ఆనందం అంటూ ఆ ఫొటో పెట్టింది. కాజోల్ చేసిన ఈ పనికి చాలామంది ఫిదా అవుతున్నారు. ఓవైపు ఆమె కూతురు అందాన్ని మెచ్చుకుంటూనే, మరోవైపు కాజోల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
కాజోల్ కూతురు నైసా ప్రస్తుతం చదువుకుంటోంది. మొన్నటివరకు సింగపూర్ లో చదువుకుంది. ఇప్పుడు ఉన్నత చదువుల కోసం స్విట్జర్లాండ్ వెళ్లింది. ఆమెకు నటనపై ఆసక్తి ఉందా లేదా అనే అంశాన్ని కాజోల్, అజయ్ దేవగన్ ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఆమెకు ఉన్నత చదువులంటే ఇష్టమనే విషయాన్ని మాత్రమే వెల్లడిస్తూ వచ్చారు.
బాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిలంతా ఇప్పటికే ఫీల్డ్ లోకి వచ్చేశారు. అలియాభట్, సారా అలీఖాన్, జాన్వి కపూర్, శ్రద్ధాకపూర్.. ఇలా చాలామంది హీరోయిన్లు అయిపోయారు. మరి కాజోల్-అజయ్ దేవగన్ కూతురు నైసా ఎప్పుడు హీరోయిన్ అవుతుందో చూడాలి.