బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులో నేరుగా సినిమా చేయకపోయినప్పటికీ డబ్బింగ్ సినిమాలుగా వచ్చిన మెరుపు కలలు, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే తో పాటు మొన్నీ మధ్యేనే వచ్చిన ధనుష్ విఐపి 2 చిత్రాల ద్వారా కాజోల్ తెలుగులోనూ సుపరిచితమే.
అంతేకాకుండా స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ సతీమణిగా కూడా కాజోల్ అందరికీ తెలుసు. ప్రస్తుతం కాజోల్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓటీటీ చిత్రాలపై ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం ఓటీటీల వస్తున్న కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. వెండి తెరకు సమానంగా ఓటీటీ ఎదిగింది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఓటీటీలో వస్తున్న కంటెంట్ చాలా బాగుంటుంది. ఇక ఓటీటీలో నటించే నటీనటులు ఎంతో ప్రతిభావంతులు. ఇక్కడ నటించే హీరోయిన్లకు కొలతలు ఉండాల్సిన అవసరం లేదు. ఫిగర్ లేని వాళ్లు కూడా హీరోయిన్లు అయిపోతున్నారు.
స్టార్లుగా ఎదుగుతున్నారు. హీరోయిన్లే కాదు. హీరోలకు కూడా సిక్స్ ప్యాక్ చూపించనవసరం లేదు..అంటూ బోల్డ్ గా మాట్లాడేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంటే కాజోల్ నటించే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఫిగర్ చూసేవారని, దాని కోసం వారు చాలా కష్టపడేవారని.. కానీ ఇప్పుడు కథను మాత్రేమ చూడడం వల్ల హీరోహీరోయిన్లు ఎలా ఉన్నా ప్రాబ్లమ్ ఉండడం లేదని కొంచెం ఘాటుగా చెప్పుకొచ్చింది.
కొంతకాలం క్రితం ఇలాంటి వ్యాఖ్యలే హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హీరోయిన్లకు అన్ని పాత్రలు ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు రెండే పాత్రలు హీరోయిన్లకు ఉండేవి. అయితే సతి సావిత్రి పాత్ర, లేదంటే వ్యాంప్ పాత్రలు… ఏది ఏమైనా చిత్ర పరిశ్రమలో వస్తున్నకొత్త మార్పులు మంచికే సంకేతం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.