కాజల్ అగర్వాల్ తో బాలీవుడ్ లో తొలి చిత్రంతోనే మంచి హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆవే సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ దర్శకుడు… కాజల్ తోనే ఆవే-2 సినిమా చేయాలనుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలయ్యాక కరోనా బ్రేక్ తో సినిమా షూట్ ఆగిపోయింది.
అయితే… ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని వణికిస్తూ, భయంకర వాతావరణం సృష్టించిన కరోనా వైరస్ పై సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పై ప్రశాంత్ వర్మ పనిచేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల కథనం.
అయితే, ఇందులో నటీ నటులు ఎవరూ, సినిమా ఎలా చూపించబోతున్నారు అన్న అంశాలు మాత్రం అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నాడు దర్శకుడు