బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, హీరోయిన్ కాజోల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు వివాహం అయిన అనంతరం రెండుసార్లు గర్భస్రావం అయిందని సామజిక మాధ్యమాల్లో షాకింగ్ కామెంట్స్ చేసింది కాజోల్.
కాజోల్, అజయ్ దేవ్ గణ్ జంట నటించిన ‘తన్హజీ’ చిత్రం శుక్రవారం విడుదల అవ్వనుంది. ఈ సందర్బంగా తన లైఫ్ లో జరిగిన కొన్ని కీలక సంఘటనలు గుర్తుచేసుకుంటూ కాజోల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. పాతికేళ్ల క్రితం హల్ చల్ సినిమా సెట్లో కలిశామని.. అదే సమయంలో ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చింది. నాలుగేళ్లపాటు డేటింగ్ అనంతరం మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది.
పెళ్లి అనంతరం హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లామని చెప్పుకొచ్చింది. కొంతకాలం తరువాత పిల్లలు కావాలనుకున్నామని, 2001లో ‘కభీ ఖుషీ కభీ ఘం’ సినిమా షూటింగ్ సమయంలో గర్భం దాల్చానని… అదే సమయంలో గర్భస్రావం అయిందని చెప్పింది. తరువాత కూడా మరోసారి గర్భస్రావం అయినట్లు కాజోల్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంది. దీని తరువాత మాకు నైసా, యుగ్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు’ అని ట్వీట్ చేశారు.