కళా వెంకట్రావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
ఏపీ ప్రభుత్వం అప్పులు తెచ్చి అవినీతి, దుబారా చేస్తూ… సంక్షేమ పథకాల కోసం తెచ్చామని అబద్ధాలు చెబుతోంది. అమెరికాను కొలంబస్ కనుగొన్నట్లు సంక్షేమాన్ని వైసీపీ నేతలే కనుగొన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఏ ప్రభుత్వాలు పథకాలు అమలు చేయలేదా..? దేశంలో అధికంగా అప్పులు చేస్తున్న ఏకైక రాష్ర్టం మన ఏపీనే.
టీడీపీ ప్రభుత్వం 60 నెలల్లో రూ.1,30,146.98 కోట్లు అప్పు చేస్తే… వైసీపీ ప్రభుత్వం 25 నెలల్లోనే రూ. 1,49,212.11 కోట్ల అప్పులు చేసింది. రాష్ట్ర రుణాలు జీఎస్‌డీపీలో 4 శాతానికి మించకూడదన్న ఆర్థిక సంఘం నిబంధనను కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వకుండా వారి కుటుంబాల్ని పస్తులుంచుతోంది.
ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఈనెల జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. పింఛన్ దారులు సైతం పూర్తిగా పెన్షన్ అందక బ్యాంకు ఖాతాల మెసేజ్ ల కోసం నిరీక్షిస్తున్నారు. ఉద్యోగుల జీతాల కోసం, వృద్ధుల పెన్షన్ల కోసం నెలనెలా బ్యాంకుల దగ్గర, కేంద్రం దగ్గర చేయిచాచి అప్పు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.