ఐఐఎం అహ్మదాబాద్‌కు కళా వెంకట్రావ్ బహిరంగ లేఖ రాశారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అవినీతిపై కూడా అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌పై 31 క్రిమినల్ కేసులతోపాటు, సీబీఐ విచారణ కూడా కొనసాగుతుందని లేఖ లో పేర్కొన్నారు కళా. సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటుచేసి వేల కోట్ల రూపాయలు మళ్లించారని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇసుక, మద్యం, మైనింగ్‌లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు ఆరోపించారు. ఐఐఎం అధ్యయనానికి పూర్తి సహకారం అందిస్తామని కళావెంకట్రావు వెల్లడించారు.