• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » బ్రహ్మం గారు చెప్పినట్లే..2023లో!!

బ్రహ్మం గారు చెప్పినట్లే..2023లో!!

Last Updated: January 3, 2023 at 11:53 am

భారతీయులు ఎక్కువ గా జ్యోతిష్య శాస్త్రాలను, ఖగోళ శాస్త్రాలను విశ్వసిస్తారు. వాటి లెక్కలకు అనుగుణం గా మార్పులు జరుగుతుంటాయని భావిస్తుంటారు. అయితే, మన పూర్వికులు తమకున్న అపార మేధస్సు ద్వారా ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించారు.వాటిలో “బ్రహ్మం గారి కాల జ్ఞానం” ఎక్కువ ప్రాచుర్యం పొందింది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ వారు తమకు ఉన్న అపారమైన జ్ఞానం తో భవిష్యత్ లో ఏమి జరగబోతోందో ముందే చెప్పారు.

కాల క్రమం లో జరుగుతున్న మార్పులను చుస్తే.. వీటన్నిటిని బ్రహ్మం గారు తన కాల జ్ఞానం లో ముందే ప్రస్తావించారని తెలుస్తోంది. మరో వైపు. ఎక్కడ ఏ వింత జరిగినా.. ఇది ముందే బ్రహ్మం గారు చెప్పారు అంటూ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఇలాంటి వాటిల్లో కరోనా వైరస్ కూడా ఉంది.

ఈ మహమ్మారి గురించి కూడా బ్రహ్మం గారు ముందే హెచ్చరించారట.”కోరంకియను జబ్బుకోటిమందికి తగిలి, కోడిలాగ తూగిసచ్చేరయ” అంటూ ఆయన కాలజ్ఞానం లో ప్రస్తావించారని చెబుతారు. ఇప్పటికే ఈ విశేషాలకు సంబంధించి సోషల్ మీడియా లో చాలా కధనాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమం లో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ వారు ఏమి చెప్పారు..? 2023 లో అవి ఎంత వరకు జరిగే అవకాశం ఉంది అన్న విషయాలను తెలుసుకుందాం.

వాస్తవానికి, బ్రహ్మం గారి వేషధారణ చూసిన ఎవరైనా ఆయనను ఆధ్యాత్మిక వేత్త గా భావించేవారట. కానీ బ్రహ్మం గారు హేతువాదిగా ఉండేవారట. ఈ విషయాన్నీ చరిత్రకారులు కూడా చెబుతున్నారు. క్రీ.శ. 1622 క్రీ.శ. 1693 మధ్య బ్రహ్మం గారు జీవించారు. ఆయన కాల బ్రహ్మ యోగి గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆయన రాసిన కాలజ్ఞానాన్ని ఓ ప్రామాణికం గా పరిశీలించుకుంటూనే వస్తున్నారు. కరోనా తరువాత ఈ భయంకరమైన పరిస్థితులు ఇంతటితో ఆగిపోవని బ్రహ్మం గారు కాలజ్ఞానం లో పేర్కొన్నారని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, బ్రహ్మం గారు చెప్పినది మరోసారి జరుగుతున్నట్లుంది. ప్రస్తుతం బ్రిటన్ నుంచి కొత్త స్ట్రెయిన్ స్ప్రెడ్ అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా, ఈ వేరియంట్ విషయం లో జాగ్రత్త గా ఉండాలని హెచ్చరిస్తోంది. దీనిని పట్టి, కరోనా ఇంకా అయిపోలేదు..పరిస్థితి మరింత భయంకరం గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కరోనా మహమ్మారి ఇంకా అవలేదని.. ఒమిక్రాన్ పేరిట మరో కొత్త వైరస్ పుట్టుకొస్తోందని తెలుస్తోంది. ఈ మహమ్మారి వచ్చిన తరువాత నుంచి కీలక మైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన కాలజ్ఞానం లో వివరించారు. ఇంకా చాలా విషయాలను ఆయన వివరించారు. అవేంటో ఇపుడు చూద్దాం..

ఆయన కాశీ లోని దేవాలయం 40 రోజుల పాటు పాడుపడుతుందని తెలిపారు. 1910 -12 మధ్య కాలం లో గంగానదికి వరదలు రావడం తో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయం లో కలరా వ్యాధి విపరీతం గా ప్రబలడం తో నలభై రోజుల పాటు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి ఎవరు రాలేదు.

ఓ అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యాన్ని రక్షిస్తుందన్నారు. ఆయన చెప్పినట్లే ఇందిరా గాంధీ భారత ప్రధాని గా 16 సంవత్సరాలు కొనసాగారు. రాజుల పాలన, రాచరిక వ్యవస్థ నశిస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్లు గానే ప్రస్తుతం రాచరిక వ్యవస్థ లేదు. ప్రజాస్వామ్యం అమలు లో ఉంది. అలాగే, స్త్రీలపై అక్రమాలు ఎక్కువ అవుతాయని, వ్యభిచారిణి వలన భయంకరమైన వ్యాధులకు గురి అవుతారని చెప్పారు. ఇప్పటికే వ్యభిచారం, అక్రమ సంబంధాల వలన ఎయిడ్స్ వ్యాధి ప్రబలింది. దీనికి చాలా కాలం మందు కనుక్కోలేక, ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

అలాగే, కృష్ణానది గురించి కూడా బ్రహ్మం గారు చెప్పిన విశేషాలు ప్రాచుర్యం పొందాయి. తెలుగు రాష్ట్రము లోని కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కు పుడక ను తాకుతుందని చెప్పారు. జలప్రళయం జరిగి నాగార్జున డాం బీటలు వారితే, కృష్ణానది దుర్గమ్మను తాకే ప్రమాదం ఉంది. అలాగే, కృష్ణానది మధ్య లో బంగారు రధం ఉంటుందిట. అది చూసిన వారికి, దాని కాంతి వలన కంటిచూపు పోయే ప్రమాదం ఉంటుందట. అలాగే, ఒక మొసలి ఎనిమిది రోజులుండి భ్రమరాంబ గుడి లోకి చేరి మేకపోతులా అరిచి మాయం అవుతుందట. అలాగే, కర్నూలు జిల్లా ఆదోని మండలం లో కప్ప కోడై కూస్తుంది. అదే కనక జరిగితే ఎన్నో అనర్ధాలు వస్తాయట.

శ్రీశైలానికి దక్షిణం లో వందల కొద్దీ రాళ్లు రాలడం తో చాలా మంది ప్రాణాలు కోల్పోతారట. అలాగే, ఎన్నో రాతిముక్కలు లేచి ఆకాశం వైపు ఎగురుతాయట. కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందట.. అలాగే, కలియుగం లో ఐదువేల సంవత్సరాలు గడిచిన తరువాత గంగమ్మ అసలు కనిపించదట. వీటిలో కొన్ని ఇప్పటికే జరిగాయి. దీనితో, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం నిజం అవుతుందని  విశ్వసిస్తున్నారు.

Also Read: పిల్లల ముందు..జాగ్రత్త!!

Primary Sidebar

తాజా వార్తలు

ఆ లేఖ నకిలీది… క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం…!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

అగ్ని ప్రమాదం పై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి!

యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్న గవర్నర్

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

నూతన సెక్రటేరియట్ వెనుక భాగంలో అగ్నిప్రమాదం…!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

ప్రతిపక్ష పార్టీల అత్యవసర సమావేశానికి ఖర్గే పిలుపు…!

తొందరపాటు వల్లే అగ్ని ప్రమాదం: బండి!

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు..!

బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ…!

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం…!

ఫిల్మ్ నగర్

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap