సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా నుండి కళావతి అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్ ను సంపాదించిన ఈ లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ వన్ లో నిలిచింది.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే జి ఎమ్ బి ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.