సిద్దిపేట జిల్లాలోని నారాయణరావు పేట మండలం, బంజరు పల్లి గ్రామంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావ్.. కాళేశ్వరం ఫలితంగా ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి, అధిక ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.
మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్ పామ్ అని హరీష్ రావ్ ఈ సందర్భంగా అన్నారు. పని తక్కువ, ఖర్చు తక్కువ… ఆదాయం ఎక్కువని అన్నారు. దీంతో పాటు అదనపు ఆదాయం కోసం ఆయిల్ పామ్ లో అంతర పంటలు కూడా వేయొచ్చని హరీష్ రావ్ అన్నారు. కాళేశ్వరం ఫలితంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు అధిక మేలు చేకూరుతుందన్నారు.
ఆయిల్ పామ్ సాగులో సిద్దిపేట జిల్లా…రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు హరీష్ రావ్. జిల్లా వ్యాప్తంగా 6,300 ఎకరాల్లో ఈ మొక్కలు నాటామని.. 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
దీనిని మంచి భవిష్యత్తున్న పంటగా చెప్పుకోవచ్చని..లక్షల కోట్ల విలువైన ఆయిల్ పామ్ ను మన దేశం దిగుమతి చేసుకుంటున్నదని మంత్రి హరీష్ రావ్ అన్నారు.