నందమాయా గురుడ నందామయా చింతచెట్టుకు కల్లు పారేనయా అంటూ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినది నిజమవుతున్నదా..! అంటే అవుననే అంటున్నారు జనగామ జిల్లా పాలకుర్తి వాసులు.
గ్రామ పంచాయతీ సమీపంలో గల అంగడి బజారులోని ఎల్లబోయిన సోమ్మళ్ళు ఇంటి ఆవరణలో చింత చెట్టుకు కల్లు ఏరులై పారుతోంది.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి జనం తండోపతండాలుగా ఈ వింతన్ని చూడటానికి వస్తున్నారు.
సాధారణంగా తాటి, ఈత, ఖర్జూర చెట్లకు, ఆఖరికి కొబ్బరి, జీలుగ, వేప చెట్లకు కూడా కల్లు తీయడం చూస్తుంటాం. ఈ చెట్ల నుంచి వచ్చే కల్లును చాలా మంది ఇష్టంగా సేవిస్తుంటారు. వేప కల్లును ఆయుర్వేద ఔషధంగా కూడా వినియోగిస్తారు.
అయితే కొందరు చింతచెట్టుకి కల్లు రావడంలో వింత ఏమీ లేదని అంటున్నారు. అంతేకాక వేప చెట్టు, మర్రి చెట్టు అలాగే చింత చెట్టు లాంటి కొన్ని చెట్లకు రోగాలు వచ్చినపుడు, చెట్టుకి ఎక్కడైనా కట్ అయితే అక్కడ బాక్టీరియా లాంటివి వచ్చినపుడు నురగలాంటిది సాధారణంగా వస్తుందని అంటున్నారు.
Also Read: ఈ ఇంటిని మడతెట్టి పట్టుకుపోవచ్చు..!