బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి మూడు సీజన్ లు పూర్తి చేసుకొని నాలుగవ సీజన్ లోకి అడుగుపెడుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా వస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభం కానుంది. అయితే హౌస్ లో కంటెస్టెంట్ లు ఎవరెవరు అనేది కొన్ని పేర్లు బయటకు రాగా మరికొన్ని పేర్లు తెలియాల్సి ఉంది.
ఈ నేపథ్యంలొనే ఆ పేర్లలో నటి కల్పిక గణేష్ పేరు కూడా ఒకటి. అయితే బిగ్ బాస్ ఎంట్రీ పై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ రియాలిటీ షోలో ఎప్పటికీ నన్ను చూడబోరు అంటూ కల్పిక తెలిపారు. దీంతో భవిష్యత్‌లో కూడా తాను ఈ షోలో పాల్గొనబోనని కల్పికా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు.