వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. స్థానికంగా ఉన్న డిపోల్లో అమ్ముతున్న కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురవతున్నారు. ఇప్పటికే కల్తీ కల్లు కారణంగా… ఒకరు మృతి చెందారు.
జిల్లాలోని నవాబుపేట మండలంలో 102 మంది అస్తస్థతకు గురయ్యారు. రెండు మండలాల్లోని 18 గ్రామాలకు చిట్టిగిద్ద నుంచి కల్లు సరఫరా అవుతుంది. ఈ డిపో నుండి వెళ్లిన కల్లు తాగిన వారే అస్వస్థతకు గురవుతున్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం 11 గ్రామాల్లో 212 మంది అస్వస్థతకు గురయ్యారు.