కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోతున్నారంటు గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియా అకౌంట్ లో తన ప్రొఫైల్ నేమ్ లో శ్రీజ కళ్యాణ్ ను మార్చుకుని శ్రీజ కొణిదెల గా మార్చింది. ఇదిలా ఉండగా కళ్యాణ్ దేవ్ తన తదుపరి ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు.
అందుకు సంబంధించి తాజాగా ఓ పిక్ లో బయటకు వచ్చింది. ఇందులో కళ్యాణ్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ తో అందరికీ షాక్ ఇచ్చాడు.
మీరు ఇది చేయలేరు అని ఎవరైనా మీకు చెప్పినప్పుడు కేవలం నవ్వుతూ చూడమని వారికి చెప్పండి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
ప్రస్తుతం రమణ తేజ దర్శకత్వంలో వస్తున్న కిన్నెరసాని సినిమా చేస్తున్నాడు. గతంలో సూపర్ మచ్చి, విజేత చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ దేవ్.