తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసే కథానాయకులలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఆయన కంటూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు.
లుక్స్ పరంగా కూడా ప్రయోగాలు చేస్తుంటారు. ‘బింబిసార’ సినిమాతో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఆయన… ఆ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు. ఇప్పుడు కొత్త సినిమాలో కూడా ఆయన డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమా ‘అమిగోస్’ . టైటిల్ స్పానిష్ వర్డ్. మన స్నేహితుని గురించి చెప్పడానికి సూచించే పదం. దాన్ని టైటిల్‌గా పెట్టటం వెనుక ఉన్న కారణం ఏంటి? అనే క్యూరియాసిటీ ప్రేక్షకులు అందరిలో ఉంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… సినిమాలో హీరో లుక్స్ రెండు విడుదల చేశారు.
అమిగోస్’ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ రెండు లుక్స్ విడుదల చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మంజునాథ్‌గా, ఎంట్రప్రెన్యూర్ సిద్ధార్థ్‌గా.. లుక్స్ పరంగా కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ చూపించారు. త్వరలో పాటల్ని కూడా విడుదల చేయనున్నారు. దివంగత గేయ రచయిత వేటూరి రాసిన పాట సినిమాలో ఉందని, త్వరలో పాటల్ని విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.