కుటుంబ కథ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించడంలో సతీష్ వేగేశ్నకు మంచి పేరుంది. ఆయన తాజా చిత్రం ఎంత మంచివాడవురా ఈ నెల 15వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం ముంచుకొస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా గురుంచి హీరో కళ్యాణ్ రామ్ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ మూవీలో హీరో ఏది నెగిటివ్ గా తీసుకోడని.. అన్ని పాజిటివ్ గా తీసుకుంటాడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనలాగే అందరిని మార్చేందుకు హీరో ప్రయత్నిస్తాడని చెప్పకొచ్చారు.
అయితే ముందుగా ఈ సినిమాకు ఆల్ ఈజ్ వెల్ టైటిల్ అనుకున్నామని చెప్పారు. కానీ తెలుగుదనం ఉట్టిపడేలా ఉండాలని అనుకోని.. ఎంత మంచివాడవురా అనే టైటిల్ ఖరారు చేశామని కళ్యాణ్ రామ్ వివరించారు.