షూటింగ్ పూర్తయి, అధికారికంగా ప్రచారం ప్రారంభించేవరకు కల్యాణ్ రామ్ సినిమాల స్టేటస్ బయటకు రాదు. సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటూపోవడం ఈ హీరో స్పెషాలిటీ. ఇన్నాళ్లూ ఇలానే చేసిన కల్యాణ్ రామ్, బింబిసార సక్సెస్ తర్వాత రూటు మారుస్తాడని అంతా అనుకున్నారు.
కానీ కల్యాణ్ రామ్ మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. ఎప్పట్లానే సైలెంట్ గా షూటింగ్ పూర్తిచేస్తున్నాడు. ఇందులో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమాను కొలిక్కి తీసుకొచ్చాడు.
మైత్రీ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. ఓపెనింగ్ టైమ్ లో ఈ సినిమా ఒకటుందని తెలుసుకున్నారు ప్రేక్షకులు. ఆ తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేశారు.
ఎట్టకేలకు ఈ మూవీ నుంచి అప్ డేట్ వచ్చింది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. రీసెంట్ గా జరిగిన గోవా షెడ్యూల్ తో సినిమా షూట్ దాదాపు పూర్తయింది. ఫైనల్ షెడ్యూల్ త్వరలోనే మొదలవుతుంది.
ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆషిక రంగనాధ్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, విడుదల తేదీని ప్రకటిస్తారు.