కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా బింబిసార. ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్టయింది. కల్యాణ్ రామ్ కు కాసుల వర్షం కురిపించింది. అయితే ఇది థియేటర్లలో ఎంత హిట్టయిందో, నాన్-థియేట్రికల్ గా కూడా అంతే పెద్ద హిట్టయింది.
జీ5లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెడితే లక్షల గంటల వ్యూయర్ షిప్ వచ్చింది. వేలాది సబ్ స్క్రిషన్స్ వచ్చాయి. ఇక తాజాగా జీ తెలుగులో సినిమాను ప్రసారం చేస్తే.. 11.5 రేటింగ్ వచ్చింది. ఇది చాలా ఎక్కువ టీఆర్పీ. ఇంకా చెప్పాలంటే కల్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ నంబర్ ఇది.
ఇలా నాన్-థియేట్రికల్ గా కూడా సినిమా హిట్టవ్వడంతో, కల్యాణ్ రామ్ ఇప్పుడు తన రేటు సవరించినట్టు తెలుస్తోంది. తన అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి ఇతడు నాన్-థియేట్రికల్ రైట్స్ కింద భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు అగ్రిమెంట్లు రాయించుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అమిగోస్ అనే సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న సినిమా ఇది. ఈ మూవీ తర్వాత ఈ హీరో నుంచి డెవిల్ అనే సినిమా రాబోతోంది. ఈ రెండు సినిమాలూ నాన్ – థియేట్రికల్ లో చాలా పెద్ద డీల్స్ చేయబోతున్నాయి.