నందమూరి ఫ్యామిలీ హీరోల్లో విభేదాలు బహిరంగ రహస్యమే. అయితే కొట్టుకోవటం అంతలోనే కలిసిపోవటం కూడా నందమూరి ఫ్యామిలికి కొత్తేం కాదు. ముఖ్యంగా బాబాయ్-అబ్బాయ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా మరోసారి నందమూరి బాబాయ్-అబ్బాయ్‌లు ఒకే వేదికపై సందడి చేసే అవకాశం కనపడుతోంది.
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన సినిమా ఎంతమంచి వాడవురా… ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. జనవరి 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటంతో 8న జెఆర్సీ కన్వెన్షన్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రాబోతుండగా… బాలయ్య కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్‌రామ్ సినిమా సహా నిర్మాతగా ఉన్న శివలంక కృష్ణప్రసాద్ బాలయ్యకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. దీంతో బాలయ్య కూడా రాబోతున్నారన్న చర్చ ఊపందుకుంది. పైగా రాజకీయంగా కూడా ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ కలయిక టీడీపీకి ఎంతో అవసరమని బాలయ్య, చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.