నందమూరి కల్యాణ్‌రామ్ స్వతహాగా చాలా వినయ విధేయత కలిగిన హీరో కం ప్రొడ్యూసర్. ఏమాత్రం ఆవేశం ఉండదు. అందరితో చాలా పోలైట్ గా ఉంటారని టాక్. నందమూరి ఫ్యామిలీలో ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కళ్యాణ్ రామ్. చాలా కాలంగా మాంచి హిట్ కోసం చూస్తున్నారు. ఎంత అంటే అనిల్ రావిపూడి సెన్సేషనల్ హిట్ మూవీ పటాస్ అంత..!
అందుకే ఫ్యామిలీ డైరెక్టర్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో కొత్త మూవీ సిద్ధం చేస్తున్నాడు. దానికి టైటిల్ కూడా చాలా సాఫ్ట్ గా ఫిక్స్ చేశారు. కల్యాణ్‌రామ్ సరసన మెహరీన్ కథనాయికగా నటిస్తున్న ‘ఎంత మంచివాడవురా!’ మూవీని శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ రేస్ కి రెడీ అవుతోంది.
శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో వస్తున్న చిత్రానికి ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తాలు నిర్మాతలు కాగా గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాకి విడుదలకి సంబంధించిన పోస్టర్లను హీరో కల్యాణ్‌రామ్ ట్విట్లర్లో ట్వీట్ చేశారు. సంక్రాంతి పండుగకి థియేటర్లో కలుసుకుందాం అంటూ పోస్ట్ చేశారు. కల్యాణ్‌రామ్ కు ఎంత మంచివాడవురా! మూవీ బిగ్ హిట్ ఇస్తుందని ఫాన్స్ ఆశ.