కమల్, రజనీకాంత్‌లు చేతులు కలపబోతున్నారా…? తమిళ రాజకీయాలు ఏలాలంటే ఇద్దరి అగ్ర నాయకుల కలయికే శరణ్యమని భావిస్తున్నారా…? కమల్ మాటలు వింటే అదో అనిపిస్తోంది. తమిళ ప్రజల కోసం అవసరమైతే తాము కలిసి పనిచేయడానికి సిద్ధమంటూ కమల్ చేసిన ప్రకటన ఇప్పుడు తమిళనాడులోనే కాదు దేశమంతటా చర్చ సాగుతోంది.
ఇటు కమల్ స్పందనపై రజనీకాంత్ కూడా అదేవిధంగా స్పందించారు. తమిళ ప్రజల కోసం తాము కలిసి పనిచేయడానికి సిద్ధం అని వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరు అగ్రనాయకుల కలయిక లాంఛనమే అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇటీవల బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్ బీజేపీవైపు మొగ్గుచూపుతారేమో అని అంతా అనుకున్నా… ప్రాంతీయపార్టీకే రజనీ జైకొడుతున్నట్లు తాజా వ్యాఖ్యాలను బట్టి అర్థమవుతోంది.
అంతేకాదు.. రజనీచేసిన వ్యాఖ్యలు చూస్తే… రాజకీయాల్లో అద్భుతాలు, ఆశ్చర్య ఘటనలు సాధారణం. పళనిస్వామి సీఎం అవుతారని ఎవరైనా ఊహించారా, సీఎం అయ్యాక కూడా వారం రోజులకో, నెల రోజులకో ఆయన ప్రభుత్వం కూలిపోతుందని అంతా భావించారు. కానీ ఆయన రెండు సంవత్సరాలుగా సీఎంగా కొనసాగుతున్న విషయాన్ని రజనీ గుర్తు చేశారు.
సినీ రంగం ఏలుతున్న తమిళ రాజకీయాలకు రజనీ-కమల్ పూర్వవైభవం తెస్తుందో చూడాలి.