భారతీయుడు-2 సినిమా సెట్స్‌లో క్రేన్ ప్రమాదంలో మరణించిన ముగ్గురికి హీరో కమలహసన్ సహాయాన్ని ప్రకటించాడు. చెన్నై ఈవీపీ స్టూడియోలో భారతీయుడు-2 సినిమా షూటింగ్ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మధు, చంద్రన్, కృష్ణలు మరణించగా… హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో పాటు డైరెక్టర్ శంకర్ తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకోగలిగారు.
షూటింగ్ ప్రమాదం తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కమలహసన్, తాను ముగ్గురు స్నేహితులను కోల్పోయానన్నారు. ఈ ముగ్గురు కుటుంబాలకు కోటి రూపాయల సహయం ప్రకటించారు.