వాయిదా పడుతూ వస్తోన్న ‘భారతీయుడు 2’ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రాయలసీమలో జరుగుతోంది. కడప జిల్లా గండికోటలో వేసిన ప్రత్యేక సెట్ లో బ్రిటీష్ కాలం నాటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కూరగాయలు, పశువుల అమ్మకాలు జరుగుతున్న మార్కెట్ పై బ్రిటీష్ పోలీసులు దాడి చేస్తుంటే, కమల్ వారిని ఎదుర్కునే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
ఆదివారం ఈ షూటింగ్ మొదలవ్వగా.. మొత్తం ఆరు రోజుల పాటు గండికోటలో షూటింగ్ జరగనుంది. ఈ మూవీ షూటింగ్ కోసం కమల్ హాసన్ చాపర్ లో వస్తున్నారు. కమల్ చాపర్ లో స్పాట్ కు వచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతీ రోజు తిరుపతి నుంచి హెలికాప్టర్ లో షూటింగ్ కోసం గండికోటకు వచ్చి వెళ్తున్నారు.
బిగ్ బాస్ తమిళ సీజన్ 6 షూటింగ్ ను ముగించిన తర్వాత కమల్ హాసన్ ఇప్పుడు ఈ చిత్రంపైనే పూర్తిగా దృష్టి సారించారు. ఈ చిత్రంలో కమల్ కు జంటగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరణ్‌తో కలిసి ఉదయనిధి స్టాలిన్ దీనిని నిర్మిస్తున్నారు.
1996లో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు మూవీ తెలుగులో విడుదలైంది. కమల్ హాసన్ డ్యుయెల్ రోల్ లో అదరగొట్టారు. తన నటనతో అందర్నీ మెప్పించి అవార్డులు అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.
#Ulaganayagan @ikamalhaasan from #Indian2 shooting spot in AP..
Uses a helicopter for daily commute.. pic.twitter.com/GCvlm8uOTi
— Ramesh Bala (@rameshlaus) February 1, 2023