సీనియర్ నటుడు కమల్ హాసన్ డిశ్చార్జ్ అయ్యారు. నవంబర్ 22న కరోనా బారిన పడ్డ కమల్ హాసన్ చెన్నై లోని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అయితే డిసెంబర్ 1న కమల్ కు నెగిటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని చెబుతూ శ్రీరామచంద్ర ఆసుపత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. కానీ మరో రెండు రోజులు ఐషోలేషన్ ఉండబోతున్నట్లు ప్రకటించారు కమల్.
కాగా నేడు ఆసుపత్రి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు కమల్. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక డాక్టర్స్ తో కమల్ హాసన్ దిగిన ఫోటో వైరల్ అవుతుంది.