తమిళనాడులో లోకనాయకుడు కమల్ హాసన్ బర్త్ డేని అభిమానులు చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. కమల్ మాత్రం చాలా ప్రైవేట్ గా సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. కమల్, ఇద్దరు కూతుర్లతో పాటు… చారు హాసన్, ఆయన కుమార్తె సుహాసినితో సహా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. దానికి కారణం కమల్ ఫ్యామిలీ ఫొటోలో పూజా కుమార్ ఉండడమే. ఫ్యామిలీ ఫొటోలో ఈ కొత్త వ్యక్తి ఎందుకు కనిపిస్తుంది, కమల్ నాలుగో పెళ్లి చేసుకున్నాడా అంటూ అనుమానాలు వస్తున్నాయి…
కమల్ పూజలు మొదటిసారి విశ్వరూపంలో కలిసి నటించారు. ఆ తర్వాత ఉత్తమ విలన్, విశ్వరూపం2లో కూడా పూజా కుమార్ ని హీరోయిన్ గా నటించింది. వాళ్ల ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కారణంగానే పూజా కంటిన్యూ అయ్యి ఉండొచ్చని అంటున్నారు. 1978లో నటి వాణి గణపతిని పెళ్లి చేసుకున్న కమల్, పదేళ్ల తర్వాత విడిపోయారు. వాణితో డివోర్స్ అయ్యాక కమల్, సారికని వివాహం చేసుకున్నాడు. సారికకి శృతి హాసన్, అక్షర హాసన్ కుమార్తెలు. కొన్నెళ్లకి సారిక నుంచి కూడా విడిపోయిన కమల్, గౌతమితో కొంతకాలం సహజీవనం చేశాడు. రెండేళ్ల క్రితం ఈ సంబంధం కూడా ముగిసింది. గతంలో కూడా పూజా కుమార్, కమల్ హాసన్ పై వార్తలు వచ్చినా, అప్పుడు కమల్ జీవితంలో గౌతమి ఉండడంతో ఆ వార్తలని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం గౌతమీ కమల్ విడిపోపోయారు. ఆమె స్థానంలోకే పూజా కుమార్ వచ్చింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కమల్ పూజని పెళ్లి చేసుకున్నాడా లేక లివింగ్ టుగెదర్ రిలేషన్ లో ఉన్నారా అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరి గురించి చర్చ జరుగుతూనే ఉంది.