ఒక సినిమాకు సంగీతం అందించడం అంటే మాటలు కాదు. ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా అంచనా వేసుకుని ఒక్కో సీన్ కు ఒక్కో విధంగా సంగీతం అందించాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం సినిమా చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇక మన దేశంలో సంగీత దర్శకుల్లో కొందరు వేగంగా అద్భుతంగా సంగీతం అందిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఇళయ రాజా ముందు వరుసలో ఉంటారు. హీరోకి తగ్గట్టు, సినిమాకు తగ్గట్టు, దర్శకుడికి తగ్గట్టు అందిస్తారు.
అలా ఆయన అందించిన ఒక సినిమా సంచలనమే అయింది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన హే రామ్ సినిమా కు ముందు సంగీత దర్శకుడు వేరే వారు. అయితే ఆయన సంగీతం సరిగా ఇవ్వలేదు అనే విషయం కమల్ హాసన్ కు సినిమా చూసినప్పుడు అర్ధమైంది. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత చూసే వారు అప్పట్లో. అప్పుడు సినిమా. చూస్తే నేను అనుకున్న సినిమా ఇది కాదు, సంగీతం ఇలా కాదు అనుకున్నారట.
ఇక సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించడం తో ఏం చేయాలో అర్ధం కాలేదట కమల్ హాసన్ కు. దీనితో ఇళయ రాజా వద్దకు వెళ్తే ఆయన సినిమా చూడాలని అడిగారట. ఒకసారి సినిమా చూసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మరోసారి సినిమా చూసి పాటలకు, మరో సారి సినిమా చూసి కీలక సన్నివేశాలకు ఆయన పేపర్ మీద నోట్స్ రాసుకుని మ్యూజిక్ ని రోజుల వ్యవధిలో ఇచ్చేశారట. అదే లిప్ మూమెంట్‌కీ, అదే టెంపోలో వేరే ట్యూన్స్‌తో పాటలు చేశారట. కేవలం రెండు రోజుల్లో ఆయన సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించారట.