తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధ్యక్షుడు కమల్ విమర్శల దాడి పెంచారు. ముఖ్యంగా ప్రధాని మోదీ లక్ష్యంగా ఆయన విరుచుకుపడుతున్నారు. కొత్త పార్లమెంట్ నిర్మాణం కోసం ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంపై కమల్ హాసన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో సగం మంది ఆకలితో ఉంటే.. వెయ్యి కోట్ల రూపాయలతో కొత్త పార్లమెంట్ భవనం కట్టాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. కరోనా కారణంగా కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయి … పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణ సమయంలో వేల మంది మరణిస్తే.. ప్రజలను రక్షించడానికే ఆ గోడను నిర్మిస్తున్నామని అక్కడి రాజులు చెప్పారు. మరి ఎవరిని రక్షించడానికి వెయ్యి కోట్లతో పార్లమెంట్ నిర్మిస్తున్నారు. దయచేసి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.. నా ప్రియమైన ఎన్నుకోబడిన ప్రధాన మంత్రి? అంటూ కమల్ హాసన్ ఘాటుగా ట్వీట్ చేశారు. కాగా, ఈ నెల 10న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం మోదీ శంకుస్థాపన చేశారు.
சீனப்பெருஞ்சுவர் கட்டும் பணியில் ஆயிரக்கணக்கான மக்கள் மடிந்து போனார்கள். மக்களைக் காக்கத்தான் இந்தச் சுவர் என்றார்கள் மன்னர்கள். கொரோனாவால் வாழ்வாதாரம் இழந்து பாதி இந்தியா பட்டினி கிடக்கையில்,ஆயிரம் கோடியில் பாராளுமன்றம் கட்டுவது யாரைக்காக்க?
(1/2)— Kamal Haasan (@ikamalhaasan) December 13, 2020
Advertisements