అనారోగ్య కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇదే విషయాన్ని చెబుతూ ట్విట్టర్ వేదికగా ఓ లెటర్ ను కూడా పోస్ట్ చేశారు. నూతన పార్టీ ఆలోచనకు తాత్కాలిక విరామం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన లేదని తప్పకుండా రాజకీయాల్లోకి మాత్రం వస్తానని.. కానీ ఇప్పుడు కాదని తేల్చి చెప్పేశారు.
దీంతో రజినీ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. అయితే ఇదే విషయమై కమల్ హాసన్ స్పందించారు. రజినీకాంత్ అభిమానులు లాగే నేను కూడా నిరాశ పడ్డానని కానీ తన ఆరోగ్యం తనకు ఎంతో ముఖ్యమని కమల్ చెప్పుకొచ్చారు.