తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రజనీకాంత్ కు ఒకే అయితే సీఎం అభ్యర్థిగా ఉండటానికి రెడీ అంటూ కమల్ హసన్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంచీపురంలో కమల్ పర్యటించారు.
పార్టీని స్థాపించినా సీఎం అభ్యర్థిగా ఉండనని రజనీకాంత్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనే కోరితే మీరు సిద్ధమేనా అన్న ప్రశ్నకు రజనీ తనను ప్రకటిస్తే అంగీకరిస్తానని బదులిచ్చారు. డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపే ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ఎందుకు చూపడం లేదని విమర్శించారు. రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం 2,500 ఇస్తోందని… తాను డబ్బులు కన్నా ప్రజలను విశ్వసిస్తానని చెప్పారు.