భారతీయుడు 2 సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. శంకర్ దర్శకత్వం లో కమల్ నటిస్తున్న సినిమా భారతీయుడు 2 . ఇంకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కానీ ఈ సినిమాకు అప్పుడే లీకుల బెడద తాకింది. విశ్వనటుడు కమల్ గుర్రం మీద వీధుల్లో స్వారీ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది.
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన సినిమాలో కమల్ ఎలా ఉన్నడో… అచ్చం అలాగే, అదే హెయిర్ స్టైల్, మెడలో కండువా, నాటి స్వతంత్ర పోరాట యోధుడి గెటప్ లో గుర్రం పై స్వారీ చేస్తూ కమల్ కనిపించాడు.
దర్శకుడు శంకర్ షూటింగ్ లొకేషన్ లో చాలా జాగ్రత్తలు తీసుంటాడని, కొన్ని సార్లు ఫోన్ కూడా లోపలికి రానివ్వడని కూడా ఫిలింనగర్ వర్గాల్లో టాక్ ఉంది. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీకుల బెడద తప్పేలా లేదు.