ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆరోగ్యం పై రకరకాల వార్తలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ స్పందించారు. ఆయన కాలికి శస్త్ర చికిత్స జరిగిందని శృతి తెలిపారు. నాలుగైదు రోజులు హాస్పిటల్లోనే కమల్ హాసన్ ఉంటారని అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేస్తారని శృతి హాసన్ చెప్పారు. చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో నాన్న కాలికి ఆపరేషన్ జరిగిందని…కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆ తరువాత అందరిని ఎప్పటిలానే ఆయన కలుస్తాని శృతిహాసన్ తెలిపారు.