అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ తప్పుకున్నారు.2020 లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచారం మొదలు పెట్టిన ఆమె అనూహ్యంగా ప్రచారం ముగించారు. తన మద్దతుదారులకు ఇది చాలా విచారకమని..ఈరోజు తాను ప్రచారాన్ని నిలిపివేస్తున్నానని అన్నారు. తాను తీసుకున్న నిర్ణయం కష్టతరమైనదని..అయినా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటానని తన మద్దతుదారుల నుద్దేశించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.డెమోక్రటిక్ పార్టీలో కీలక నేతగా ఉన్న కమలా హారిస్ అధ్యక్ష పదవికి ప్రముఖ పోటీదారుగా నిలిచారు. ఆమె అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి ఆర్ధిక ఒత్తిళ్లే కారణమని తెలిపారు. తాను బిలియనీర్ ను కాదు…సొంత ప్రచారానికి నిధులు సమకూర్చుకునే పరిస్థితుల్లో…పోటీ పడడానికి అవసరమైన నిధులు సేకరించడం కష్టంతో కూడుకున్న పని అని ఆమె తన మద్దతుదారులతో అన్నారు.
కమలా హారిస్ పోటీ నుంచి తప్పుకోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ”టూ బాడ్…వుయ్ విల్ మిస్ యు” అని ట్విట్టర్ లో పరోక్షంగా విమర్శలు చేశారు. దానికి మళ్లీ కమలా హారిస్ బదులిస్తూ ” డోన్ట్ వర్రీ మిస్టర్ ప్రెసిడెంట్, ఐ విల్ సీ యు ఎట్ యువర్ ట్రయల్” అని ట్విట్ చేశారు.