కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాలో అవినీతిపై పోరాటం చేస్తూ ద్విపాత్రాభినయంలో కమల్ హాసన్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఈ సినిమాకు అప్పట్లో రెహమాన్ అందించిన మ్యూజిక్ కూడా పెద్ద హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాక్ డౌన్ ముందు వరకు షూటింగ్ జరిగింది. తదుపరి షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే షూటింగ్ భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే జనవరిలోగా పూర్తి చేయాలని కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కి సూచించాడట. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ముందుగానే పూర్తి చేసుకుని రాజకీయాలపై దృష్టి పెట్టాలని కమల్ భావిస్తున్నాడట . మరోవైపు ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.