పెద్దగా చదువుకోలేదు, చిన్నప్పటినుంచి కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుంది. బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటించడం, డబ్బు సంపాదించడం తల్లి చేతిలో దెబ్బలు తినటం ఇదే పద్ధతిలో పెరిగింది. తల్లి చనిపోయిన తరువాత స్వేచ్ఛ దొరికినప్పటికీ సరైన ప్రేమ మాత్రం లభించలేదు. ఆఖరికి పెళ్ళి తర్వాత కూడా ఆమె ఆ ప్రేమను పొందలేక పోయింది. కోట్ల రూపాయలు సంపాదించింది. ఆ తర్వాత తినడానికి తిండి కూడా లేని దీనస్థితికి చేరుకుంది. పొట్టకూటి కోసం మళ్ళీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె మరెవరో కాదు… ప్రముఖ నటుడు కమల్ హాసన్ మాజీ భార్య సారిక ఠాకూర్.
నాలుగేళ్ళ వయసులో తన తల్లిని తనని వదిలేశాడు ఆమె తండ్రి. ఆ తర్వాత బాలనటిగా ఛాన్స్ వచ్చింది. తన టాలెంట్ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే ఆ సమయంలో ఆమెకు ఎంత డబ్బు వస్తుంది ఏంటి అనేది తెలియదు. తల్లిని అడగాలంటే ధైర్యం సరిపోదు. ఆమెపై తల్లి ఏ మాత్రం కూడా కనికరం, ప్రేమ చూపించేది కాదు. ఎప్పుడూ కొడుతూనే ఉండేది. నటించడం తప్ప మరో విషయం ఆమెకి తెలీదు. బడికి కూడా వెళ్లలేదు.
చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?
ఒకరోజు తల్లి లేకుండా షూటింగ్ కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ 1500 ఇచ్చాడు. ఆ సొమ్ముతో మొత్తం పుస్తకాలు కొనేసింది. ఆ విషయం తెలుసుకున్న తల్లి ఆమెను బాగా కొట్టింది. రాత్రంతా ఏడ్చి తిరిగి షూటింగ్ కి ఉదయం వెళ్ళింది. సారిక సంపాదించిన డబ్బుతో తల్లి ఏకంగా 5 అపార్ట్మెంట్లు చేసిందట. ఈ విషయం తెలిసినా ఆమెను అడిగే ధైర్యం లేకపోయింది.
కారు లో పడుకోవడం, వేరొకరి అపార్ట్మెంట్స్ లో స్నానం చేయడం తప్పని పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళడం వంటివి చేసేదట సారిక. తర్వాత తల్లి మరణించింది. దీంతో కాస్త స్వేచ్ఛ లభించినట్లు అనిపించినప్పటికీ సారిక డబ్బుతో కొనుగోలు చేసిన 5 అపార్ట్మెంట్లు ఆమె ఎవరికో ఇచ్చేసింది. సారిక తరఫున అడిగేందుకు ఎవరూ లేకపోయారు. అప్పుడు అమీర్ ఖాన్ లీగల్ గా ఎంతగానో సహాయం చేశారట. అమీర్ ఖాన్ కజిన్ నుజత్ సారిక మంచి స్నేహితులు కావడంతో ఆమెకు అమీర్ ఖాన్ నుంచి సహాయం అందిందట.
సీక్రెట్ గా ప్రేమ పెళ్లి చేసుకున్న 5 టాలీవుడ్ హీరోయిన్స్ గురించి తెలుసా ??
ఆ తర్వాత కొన్నాళ్లకు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తో ప్రేమలో పడింది. కపిల్ ను కలిసేందుకు రెగ్యులర్ గా చండీఘడ్ కూడా వెళ్లలేదట సారిక. ఆయన కుటుంబ సభ్యులతో కూడా ఆప్యాయంగా ఉండేదట. కానీ కపిల్ కు ఆల్రెడీ రోమి అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని వాళ్లు ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుసుకునేందుకు సారిక కు చాలా సమయం పట్టిందట. కపిల్ తో అలా రిలేషన్ బ్రేకప్ స్టోరీ గా మారిందట.
ఆ తర్వాత బాల నటుడి సమయం నుంచే సుపరిచితుడైన సచిన్ ఫీల్గావర్ తో ప్రేమలో పడింది. ఆ స్టోరీ కూడా సక్సెస్ కాలేదు. అలాగే మోడల్ పరాశర్ తో కొన్నాళ్ళు రిలేషన్ లో ఉండేది. మళ్లీ అతనితో కూడా విడిపోయింది. ఇక ఆ తర్వాత సాగర్ అనే సినిమా తో కమల్ హాసన్ ముంబై కి మకాం మార్చాడు. ఆ సమయంలోనే సారిక ఠాకూర్ కు కూడా దగ్గరయ్యాడు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే అప్పటికే కమల్ కు పెళ్లి జరిగింది. కానీ సారిక తో రిలేషన్ స్టార్ట్ అయ్యాకా మొదటి భార్య వాణి గణపతి తో కమల్ విడాకులు తీసుకుంటారు అని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అనుకున్న విధంగానే విడాకులు తీసుకున్నారు.
అయితే కమల్ హాసన్ తో రిలేషన్ లో ఉన్న సారిక కు పెళ్లికి ముందు 1986లో శృతిహాసన్ జన్మనిచ్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. 1991లో అక్షర హాసన్ పుట్టింది. తర్వాత కమల్ తో పెళ్లయ్యాక ఇండస్ట్రీని వదిలేసింది కమలహాసన్ కూడా చెన్నై వచ్చేశాడు. ఇక 2004వ సంవత్సరంలో కమల్ సారిక లు విడాకులు తీసుకున్నారు. కానీ పిల్లలు మాత్రం కమలహాసన్ తోనే ఉంటున్నారు. ప్రస్తుతానికి ఆస్తులు పోయి జీవనం సాగించటానికి సారిక కష్టపడుతున్నా శృతిహాసన్, అక్షరహాసన్ కమల్ మాత్రం పట్టించుకోవట్లేదు.