ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరుతో ప్రయాణికుల ఇక్కట్లతో పాటు, ఏకంగా ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటూ, సరైన శిక్షణ లేని డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తోంది. దీంతో వరుసగా ప్రమాదాలు జరుగుతోన్నాయి. తాజాగా మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ వాహనం యు టర్న్ తీసుకుంటున్న సమయంలో కామా రెడ్డి డిపోకు చెందిన బస్సు డీకొట్టింది. వెంటనే పోలీస్ వాహనం మరో వాహనాన్నిఢీ కొట్టడంతో…కార్లో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.