నిండు చందురుడు ఒకవైపు…చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు.అంటూ టక్కరిదొంగ సినిమాలో మహేష్ బాబుకి ఒక ఇంట్రో సాంగ్ ప్లాన్ చేసారు దర్శకులు.ఆ పాటకు అతని యాటిట్యూడ్ కూడా అతికినట్టు సరిపోయింది.అయితే ఆ మహేశ్ బాబు కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ విమానంలోనో,ఏ కార్లోనో, అరుదుగా ఏ బైక్ మీదనో వెళ్తుంటాడు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఈ వాహనాలేవీ వాడడం. ఈ రోజుల్లో కూడా అతని వాహనం గుర్రమే.ఎక్కడికైనా వెళ్ళాలంటే గుర్రమెక్కుతాడు.
తారు రోడ్డుమీద గుర్రం డెక్కల చప్పుళ్ళిచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్ తో మెరిన గడ్డంతో, కిరీటంలేని రాజులా గుర్రాన్నిదర్జాగా దౌడుతీయిస్తాడు. ఆ వ్యక్తి పేరే ముంతాజ్ దేశాయ్. మహారాష్ట్ర సరిహద్దుల్లోని మేదన్ కల్లూరు గ్రామంలో ఈయన నివాసం ఉంటున్నాడు. తమ గ్రామం నుంచి మద్నూర్, కోటగిరి తదితర మండలాలకు గుర్రం పైనే వచ్చి పనులు చేసుకుని తిరిగి వెళ్తానని ఆయన చెబుతున్నారు.
ఈ రోజుల్లో గుర్రంపై వెళ్తుండటం అరుదుగా కనిపిస్తుంది.ఈరోజుల్లోనూ గుర్రంపై వెళ్తున్న ముంతాజ్ దేశాయ్ను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతని వాహనానికి పెట్రోల్ కొట్టించే బాధ లేదుగానీ, పచ్చగడ్డి పెట్టడమే బాధ..ఎందుకంటే ఈ సిమ్మెంటు యుగంలో పెట్రోల్ దొరికనంత ఈజీగా పచ్చగడ్డిదొరకడం కష్టం.మనలో మనమాట ఇదైతే నిజమేకదా..ఏమంటారు..!?