కర్ణాటకలో నిర్వహించే సంప్రదాయ కంబళ పోటీల్లో మరో రికార్డు నెలకొంది. గతంలో శ్రీనివాస్ గౌడ అనే యువకుడు వంద మీటర్ల దూరాన్ని 9 . 55 సెకెన్ల లో పరిగెత్తి రికార్డు నెలకొల్పాడు. అప్పటివరకు ఉసేన్ బోల్ట్ 9.58 సెకన్ల వరల్డ్ రికార్డతో పోల్చుకుని ముక్కున వేలేసుకున్నారు అందరు. శ్రీనివాస్ గౌడ రికార్డు ను బ్రేక్ చేస్తూ మరో వ్యక్తి తన పరుగు ముగించాడు.
నిశాంత్ శెట్టి అనే యువకుడు చిరుతను తలపించేలా పరుగులు తీస్తూ 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలోనే అధిగమించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. నిశాంత్ శెట్టి కర్ణాటకలోని బజగోళి జోగిబెట్ట ప్రాంతానికి చెందినవాడు. ఈ పోటీల్లో నిశాంత్ శెట్టి మొత్తం 143 మీటర్ల దూరాన్ని 13.68 సెకన్లలో పూర్తి చేశాడు.
Advertisements