కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ మారబోతుందా…? షూటింగ్ అయిపోయాక రిలీజ్‌కు ముందు పేరు మార్చబోతున్నారా…? కానీ సెన్సెషన్ కోసమే చివరి వరకు కులాల పంచాయితీగా సినిమా చిత్రీకరిస్తున్నారా…? అంటే అవుననే అంటున్నారు సినీ క్రిటిక్స్.
కులాల పేరుతో సినిమాలు, టైటిల్స్ ఉంటే… రెచ్చగొట్టేందుకే అన్న కారణంతో సెన్సార్ బోర్డు సినిమాకు అనుమతి ఇవ్వదని, అప్పుడు పేరు మార్చక తప్పదని… ఆ విషయం డైరెక్టర్ వర్మకు కూడా తెలుసని స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబుపై ఉన్న ద్వేషంతో ఇలా కులాల పంచాయితీ పెట్టడం మంచి పద్ధతి కాదని, ఇంకోనాలుగు ఎక్కువ తిట్టినా అయిపోవు… కానీ వర్మ పర్సనల్‌గా తీసుకున్నట్లుందంటున్నారు విశ్లేషకులు తమ్మారెడ్డి భరద్వాజ.