క్రికెట్ ఆటలో ఒక్కోసారి పిల్లల్లా దిగ్గజప్లేయర్లు సైతం సహనాన్ని మరిచి ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. ఇదే విషయాన్నిపాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఇటీవలే క్రికెట్ కి సంబంధించిన అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కమ్రాన్ అక్మల్ ఓ సరదా సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘నాదిర్ అలీ పోడ్ కాస్ట్’ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన.. 2005 లో భారత-పాక్ జట్ల మధ్య మొహాలీ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గంగూలీ, షోయబ్ మాలిక్ ఒకరికొకరు వాదులాడుకున్న విషయాన్ని ప్రస్తావించాడు
.నాడు డేనిష్ కనేరియా వేసిన బంతిని గంగూలీ .. బౌండరీ షాట్ కొట్టాడని, అయితే మిడ్ ఆన్ లో ఉన్న షోయబ్ మాలిక్.. ఊరుకోకుండా బంతి సిక్స్ కి వెళ్తుందన్న ప్రెషర్ తో గంగూలీ ఉన్నట్టు కనిపించాడని, కానీ పాపం జస్ట్ బౌండరీకే వెళ్లిందని వాఖ్యానించాడని కమ్రాన్ చెప్పాడు. అప్పుడు వికెట్ కీపర్ గా తానే ఉన్నానని.. తనతోనే మాలిక్ ఈ మాటలన్నాడని తెలిపాడు.
అంటే గంగూలీని ఆట పట్టించడానికో, లేక ఆట మీద అతని సీరియస్ నెస్ ని తగ్గించడానికో మాలిక్ ఇలా వ్యవహరించాడని చెప్పాడు. మరి అదేం సమయమో గానీ ఆ నెక్స్ట్ బాల్ కే గంగూలీ ఔటయ్యాడని, దీంతో మాలిక్ మైండ్ గేమ్ పై గంగూలీకి చిర్రెత్తుకొచ్చిందని కమ్రాన్ వివరించాడు.
ఆ తరువాత క్రీజ్ బయటకు వచ్చిన గంగూలీ.. ‘తూ బహుత్ తేజ్ హై.. తుఝే మై చోడుంగా నహీ.. తూ బాహర్ ఆజా’ (నువ్వు చాలా దూకుడుగా ఉన్నావు.. నిన్ను నేను వదలను.. బయటకు రా.. చూసుకుందాం’ ) అని ఆగ్రహంగా బెదిరించాడని కమ్రాన్ మాలిక్ చెప్పాడు. టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఈ ‘ఘటన’ జరిగిందట. మొత్తానికి ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.