హైదరాబాద్ లోని కేంద్ర రక్షణ సంస్థల్లోని ఉద్యోగులను పాకిస్తానీ అమ్మాయిలు ట్రాప్ చేస్తూ కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. కంచన్‌బాగ్ డీఅర్డీఎల్ హనీ ట్రాప్ కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. డీఆర్‌డీఎల్‌లో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డిని నటాషా అనే మహిళ ముగ్గులోకి దింపి భారత అణు రహస్యాలను తెలుసుకున్నట్లు గుర్తించారు.
కె-సీరీస్ మిస్సైల్ కు చెందిన కీలక సమాచారాన్ని నటాషాకు చేరవేశాడు మల్లికార్జునరెడ్డి. యుకే అనుసంద్ద డిఫెన్స్ జర్నలిస్ట్ పేరుతో ట్రాప్ చేసింది నటాషా. 2019 నుండి 2021 వరకు సంభాషణ జరిపిన మల్లికార్జున్ రెడ్డి నటాషా కు మిస్సైల్ కాంపొనెంట్స్ కు సంబంధించి కీలక డేటా చెరవేశాడు. సబ్ మెరైన్ నుండి మిస్సైల్స్ లాంచ్ చేసే కీలక K–సిరీస్ కోడ్ ను పాకిస్తానీ స్పై కు చేరవేశాడు.
హనీట్రాప్ కేసుకు సంబంధించి మల్లికార్జున్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా మల్లికార్జున్ కు మెసేజ్ లు పంపి.. కేవలం చాటింగ్ తోనే నటాషా ట్రాప్ చేసినట్లు గుర్తించారు.
మల్లికార్జున్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. ల్యాప్ టాప్ , మొబైల్ ఫోన్ లో మిస్సైల్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా.. కె-సిరీస్ మిస్సైల్ కు చెందిన ఇన్ఫర్మేషన్ నటాషాకు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.