కమ్యూనిస్టు నాయకులు , ఆరెస్సెస్ తో రాజీ పడ్డారంటూ సామాజిక విశ్లేషకులు కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందన్నారు. బ్రాహ్మణ వాద ముసుగులో పడి కొట్టుకుపోయారని దుమ్మెత్తి పోశారు. కమ్యునిస్ట్ లు చెప్పే విప్లవం వచ్చేది కాదు…ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరని వ్యాఖ్యానించారు. తొలి వెలుగు ఎన్ కౌంటర్ విత్ రఘు షో లో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆరెస్సెస్ పచ్చ గడ్డిలో తెల్ల పాములని, కమ్యూనిస్టులు పచ్చ గడ్డిలో పచ్చ పాములతో పోల్చారు.
దేశంలో కమ్యూనిస్టులు ఘోరంగా దెబ్బతి నాడానికి కారణాలు విశ్లేషించారు. కమ్యూనిస్టులకు సంక్షేమ సిద్దాంతం లేదని, మిగతా పార్టీలకు ప్రత్యామ్నాయ వెల్ఫేర్ ఫార్ములా లేకపోవడం కారణమన్నారు.వీళ్ళు అంటున్న విప్లవం వచ్చేది కాదు పోయేది కాదు అంటూ ఘాటుగా స్పందించారు. ఇక సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్, రాఘవులు పై డైరెక్ట్ ఎటాక్ చేశారు. బ్రాహ్మణ ముసుగు తొడుక్కున్న నాయకులంటూ విమర్శించారు. ఎస్సీ ఎస్టీ బీసీ లకు కమ్యూనిస్టుల పోరాటాల వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. అసలు సీపీఎం తన పోలిట్‌బ్యూరో లో ఒక్క దళితనేతను కూడా ఎందుకు పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. సీపీఎం దళిత , అంబేడ్కర్ వ్యతిరేకి అంటూ నిప్పులు చెరిగారు.
ఎన్ కౌంటర్ విత్ రఘు షో కంచె ఐలయ్య ఇంటర్వ్యూ ఇదే…