బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ నిత్యం ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఆమె స్పందించటమే లేట్ వెంటనే అది ట్రెండ్ లోకి వచ్చేస్తుంది.
కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన గెహ్రాహియా సినిమాపై పరోక్షంగా రియాక్ట్ అవుతూ… వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను కూడా నవతరానికి చెందిన మనిషినే. కానీ ఇలాంటి రొమాన్స్‌ను అర్థం చేసుకోగలను. న్యూ ఏజ్ సినిమా పేరుతో చెత్త సినిమాను రిలీజ్ చేయకండి. బ్యాడ్ సినిమాస్ ఎప్పుడు బ్యాడ్ సినిమాలే.
స్కిన్‌షో, అశ్లీలత సినిమాను ఏ మాత్రం సినిమాను కాపాడలేవు. ఇది చాలామందికి తెలిసిన విషయం అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది.
ఇక ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలైంది ఈ సినిమా. ఇందులో దీపిక సిద్ధాంత్ లు జంటగా నటించారు.
Advertisements