94వ ఆస్కార్ వేడుకపై హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. విల్ స్మిత్ భార్య వ్యాధిపై యాంకర్ క్రిస్ రాక్ జోకులు వేయడంతో.. విల్ స్మిత్ ఆగ్రహం తట్టుకోలేక స్టేజిపైకి ఎక్కి క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించారు. అనంతరం విల్ స్మిత్ వేదికపైనే క్షమాపణలు కూడా చెప్పారు. కాగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఆస్కార్ చరిత్రలోనే మొట్ట మొదటిలసారి. అయితే, ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. విల్ స్మిత్’ వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. విత్ స్మిత్‌కు మద్దతుగా నిలిచింది కంగనా. క్రిస్ మాటలపై ఆమె ఫైర్ అయింది. మహిళల వ్యాధిని అడ్డుపెట్టుకుని మాట్లాడితే తాను ఊరుకోనని అంది. పైగా, తానైతే విల్ స్మిత్ కన్నా గట్టిగా తన్నేదాన్ని అలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదని కంగనా ఆగ్రహాం వ్యక్తం చేసింది. అంతే కాదు విల్ స్మిత్ త్వరలోనే తన లాక్ అప్ షోకి వస్తాడని ఆశిస్తున్నా అంటూ ఆమె చెప్పింది.
“విల్ స్మిత్ చెంపపై కొట్టి వదిలేసాడు. నేనైతై ఇంకా గట్టిగా తన్నేదాన్ని. కొంతమంది మూర్ఖులు నవ్వించడానికి మా అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని ఉపయోగించుకుంటే.. నేను విల్ స్మిత్ లాగే చేస్తాను. గట్టిగా బధులిస్తా. ఇలాంటి వాళ్లని వదిలి పెట్టకూడదు. ఆయన త్వరలోనే నా లాక్ అప్ షోకి వస్తాడని ఆశిస్తున్నా” అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. దానికి లాఫింగ్ ఎమోజీని జత చేసింది.
అయితే, ఇలా ఉన్నది ఉన్నట్టు చెప్పటం కంగనాకు కొత్తేమి కాదు. మనసులో ఏది ఉంటే దాన్ని బయటకు అనేస్తుంది. ఇప్పుడు విల్ స్మిత్ ఘటనపై కూడా కంగనా చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.