మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన నేతలు తనను టార్గెట్ చేశారంటూ ఆరోపిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిశారు. ముంబైలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఆయనకు వివరించినట్టు చెప్పారు. తనకు న్యాయం జరిగి.. తద్వారా ఈ వ్యవస్థపై ఎంతో మంది యువతులు పెట్టుకున్న నమ్మకం తిరిగి నిజం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. గవర్నర్ సొంత కూతురిలా భావించి తన సమస్య వినడం అదృష్టంగా భావిస్తునన్నారు కంగనా. గవర్నర్‌ను కలిసిన సమయంలో కంగనా వెంట ఆమె సోదరి రంగోళీ కూడా ఉన్నారు.
ముంబయిని పాక్ అక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత .. కంగనా అనేక చిక్కుల్లో పడ్డారు. బీఎంసీ అధికారులు ఆమె ఆఫీసును కూల్చివేయడం.. డ్రగ్స్ కేసులో ఆమె పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. ఈక్రమంలోనే కంగనా గవర్నర్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది.